7, జులై 2009, మంగళవారం

ఇది నా ప్రార్థన













ఇదే నీకు నా ప్రార్థన, ప్రభో !

నరుకు నరుకు నా హ్రుదయంలోని దరిద్రాన్ని సమూలంగా నరుకు
నా సుఖదుఃఖ్కాల్ని తేలికగా తీసుకునే బలాన్ని నాకివ్వు
సేవలో నా ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ప్రసాదించు
దీనుల్ని నిరాకరించే దుర్గతినించి నన్ను తప్పించు. మదాంధుల ముందు
మోకరించలేని అభిమానాన్ని నాలో పెంపొందించు

నిత్య జీవనంలోని అల్ప విషయాలనించి నా మనసుని తప్పించే నేర్పునియ్యు
ప్రేమతో నీ సంకల్పానికి నా శక్తిని అర్పించుకునే బలాన్ని కటాక్షించు
-గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ (గీతాంజలి నుంచి..)

కామెంట్‌లు లేవు: