16, జనవరి 2011, ఆదివారం

రోజుకొక్కసారైనా


రోజుకొక్కసారైనా 
అమ్మానాన్నలకు పాదాభివందనం  చేయండి - 
వారే కదా మన ప్రత్యక్ష దైవాలు 

రోజుకొక్కసారైనా నవ్వండి -
అది ఆత్మ పాడే పాట 

రోజుకొక్కసారైనా ఆలోచించండి -
అది మనోశక్తికి ఇంధనం 

రోజుకొక్కసారైనా ఎదో ఒక ఆట ఆడండి -
అది నిత్యయవ్వన రహస్యం 

రోజుకొక్కసారైనా  ఏదైనా చదవండి -
అది ఙ్ఞాన తేజం   

రోజుకొక్కసారైనా ధ్యానం చేయండి  -
అది ధరిత్రిలోకెల్ల బలీయమైన శక్తి 

రోజుకొక్కసారైనా ప్రేమను వ్యక్తీకరించండి -
ప్రేమను అందుకోండి అది ప్రకృతి ఇచ్చిన కానుక 

రోజుకొక్కసారైనా స్నేహితులను కలుసుకోండి -
అది సంతోషానికి రాజబాట 

రోజుకొక్కసారైనా ఇతరులకు సాయపడే పనిచేయండి -
ఈ జీవితం బహు చిన్నది 

రోజుకొక్కసారైనా మీ పనిని పరీక్షించుకోండి 
అది మీ విజయయాత్రలో మైలురాయి