16, జనవరి 2011, ఆదివారం

బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే



















తందనాన ఆహి తందనాన పురే  | 
తందనాన భళా తందనాన ||

బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే | 
పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||

కందువగు హీనాధికము లిందు లేవు | 
అందరికి శ్రీహరే అంతరాత్మ |  
ఇందులో జంతుకులమింతా నొకటే | 
అందరికి శ్రీహరే అంతరాత్మ || 

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే |    
అండనే బంటునిద్ర అదియు నొకటే |  
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే |  
చండాలు డుండేటి సరిభూమి యొకటే || 

అనుగుదేవతలకును అలకామ సుఖమొకటే |  
ఘనకీట పశువులకు కామ సుఖమొకటే | 
దినమహో రాత్రములు తెగి ధనాఢ్యునకొకటే | 
వొనర నిరుపేదకును వొక్కటే అవియు ||
కొరలి శిశ్టాన్నములు గొను నాకలొకటే |  
తిరుగు దుశ్టాన్నములు తిను నాకలొకటే |
పరగ దుర్గంధములపై వాయువొకటే | 
వరుస బరిమళముపై వాయువొకటే ||
కడగి యేనుగు మీద గాయు యెండొకటే |  
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |  
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ | 
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ||  

- అన్నమాచార్య 

కామెంట్‌లు లేవు: