16, ఆగస్టు 2009, ఆదివారం

భారత్.. నీ ప్రేమలో పడిపోయా









భారత్.. నిన్ను చూడటానికి
ఈ జీవితమంతా వేచివున్నా
నిన్ను, నీ ప్రజలను కలుసుకున్నా
నీ ప్రేమలో పడిపోయా
నిన్ను విడిచి వెళ్ళిపోతున్న ఈ సమయంలో
నా గుండె వెదన, నిరాశతో నిండిపోయింది
భారత్.. నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తానని..
నిన్ను ప్రేమతో ఆలింగనం చేసుకుంటానని
హామీ ఇస్తున్నా
నీ దయాగుణం, ఆధ్యాత్మిక చైతన్యం
నన్ను కదిలించాయి
నీ ప్రజలు నా హృదయాన్ని తాకారు
వాళ్ళు దేవుడి ప్రతిరూపాలు
భారత్.. నేను నిన్ను గాడంగా ప్రేమించా
బారత్.. నువ్వు నా ప్రత్యేక దేశానివి
దేవుడు నిన్ను ఎప్పుడూ దీవిస్తూ ఉండాలి
- పాప్ రారాజు మైఖేల్ జాక్సన్
( 1996లో ముంబైలో ప్రదర్శనలు ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు
భారత్ పై తనకున్న ప్రేమాభిమానాలను ఇలా తన దిండుపై రాశారు )

4 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

ఇలాగే మనమందరి ప్రేమని పొందాలని ఆశిద్దాం!!

హను చెప్పారు...

విదేశీయుడికి కనబడిన ప్రేమ మన దేశీయులకు కూడా కనిపించాలని, ప్రతి ఒక్కరు దేశాన్ని ప్రేమించాలని ఆశిస్తూ ఒక భారతీయుడిగా నా ఆవేదను తెలియజేస్తున్నాను.

జయ చెప్పారు...

విదేశీయులు భారత సంస్క్రుతిని అభిమానిస్తున్న ఈ రోజుల్లో భారతీయులు విదేశీ సంస్క్రుతి ఆకర్ష్' నుంచి కోలుకోవటానికి ఈ కవిత ఒక మేలుకొలుపునిస్తుంది. థాంక్స్ ఫర్ దిస్ కవిత.

tirupathi peddy చెప్పారు...

thank u forur comment, padmarpita,hanu and jaya
-tirpati peddy